భారత్ సమాచార్.నెట్: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam)లో ముష్కరులు టూరిస్టుల (Tourists)ను లక్ష్యంగా చేసుకుని దాడికి (Attack) పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మొత్తం 28 మంది మరణించారు. అయితే ఈ ఉగ్రదాడిలో హిందువుల (Hindus)ను టార్గెట్ చేసి హతమార్చారు. దాడికి పాల్పడే ముందు మతం అడిగి మరీ.. హిందూ మగవాళ్లను చంపి రాక్షస ఆనందం పొందారు. తన భర్తను చంపడంతో.. తనను కూడా చంపండంటూ ఓ స్త్రీ అడిగిన ప్రశ్నకు.. మానవత్వం లేని మనిషి నుంచి వచ్చిన సమాధానం.. పోయి మోదీకి చెప్పుకు పో అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దానికి సరైన జవాబు మోదీ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ మీమ్ వైరల్ అవుతోంది. అదే ‘ఆపరేషన్ సింధూర్’. ఆపరేషన్ సింధూర్ పేరుతోనే మెస్సేజ్ పంపి అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చారు ప్రధాని మోదీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందుకు సంబంధించిన ట్వీట్లు, మీమ్‌లు, వీడియోలు. అలాగే భారత్ మహిళ సింధూరాన్ని ఉగ్రవాదులు చేరిపేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగేలా భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుందని.. భారత్ మహిళ నుదట సింధూరం పెట్టిన ఫొటో కూడా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే హిందూ సంపద్రాయంలో స్త్రీలకు సింధూరం ఎంత ముఖ్యమైనది. హిందూ స్త్రీలు.. భర్త చనిపోయిన తర్వాత సింధూరం తీసేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అలా పహల్గాంకు వచ్చిన హిందూ జంటలపై కాల్పులు జరుపుతూ కేవలం మగవాళ్లను మాత్రమే చంపి.. ఆ మహిళల సింధూరానికి, సౌభాగ్యానికి దూరం చేశారు. అలాంటి దుర్మార్గులకు సరైన సమాధానం చెబుతామని.. ప్రధాని మోదీ ఆనాడే స్పష్టం చేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతోనే ఆ ముష్కరుల ఆటకట్టించారు.