Homemain slidesఓర్రీ... పోస్ట్ చేస్తే 30 లక్షలు

ఓర్రీ… పోస్ట్ చేస్తే 30 లక్షలు

భారత్ సమాచార్, ముంబయి : సెలబ్రిటీస్ బెస్ట్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన ఓర్రీ గురించి బాలీవుడ్ ను ఫాలో అయ్యేవారికి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఇతడు బి టౌన్ లో బిగ్ షాట్లతో క్టోజ్ గా ఫొటోలు దిగుతూ బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, బిజినెస్ ప్రముఖులందరితోనూ కనిపిస్తూ నెట్ లో హల్ చల్ చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహర్ లాంటి సినీ ప్రముఖులతో పాటు ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీతో దిగిన ఫొటోలు నెట్ లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇతన్ని కొందరు ‘గే’ అని కూడా భావిస్తుంటారు. కొందరు మాత్రం ఇతడికేం పనిలేదా ఎప్పుడూ.. సెలబ్రిటీలతో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతుంటాడు అని అనుకుంటూ ఉంటారు.

అయితే ఓర్రీ ఏం తక్కువోడేం కాదు. ఇతడు సెలబ్రిటీల పక్కన కనిపిస్తూ ఆ ఫొటోలను పోస్టు చేస్తూ ఒక్క రోజులోనే ఆ ఫోటోలతో రూ.30లక్షలు సంపాదిస్తాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు మరి. ఓర్రీ.. హిందీ ‘బిగ్ బాస్ 17’ సీజన్ లో కంటెస్టంట్ గా కూడా పాల్గొన్నాడు. ఇతడు తన లైఫ్ స్టైల్ గురించి అందరితో చెప్పుకున్నాడు. మార్నింగ్ రోటిన్ పూర్తయిన తర్వాత ఫొటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాడట. దాని ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడట. యూత్ లో స్ఫూర్తినింపేందుకే ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తనతో పాటు ఎప్పుడూ మూడు ఫోన్లు ఉంటాయని, ఐదుగురు మేనేజర్స్ తనకోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. తాను యాక్టర్ గా, వెయిటర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశానని చెప్పాడు. యవ్వనంలో ఉన్నప్పుడు సంపాదించి ఓల్డ్ ఏజ్ లో ఖర్చు చేయాలనేది తన పాలసీ అన్నాడు. తనపై రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగిందని, ఆ సంఘటనలకు బాధ్యులకు దూరంగా ఉంటున్నానని తెలియజేశాడు.

మరికొన్ని సీనీ సంగతులు…

బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

RELATED ARTICLES

Most Popular

Recent Comments