July 28, 2025 4:43 am

Email : bharathsamachar123@gmail.com

BS

Oscar Awards: 2026 ఆస్కార్ అవార్డ్స్ షెడ్యూల్ ఇదే..

భారత్ సమాచార్.నెట్: సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డులను (Oscar Awards) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సంగతి తెలిసిందే. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15వ తేదీన జరగనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) తాజాగా వెల్లడించింది. 2026 మార్చి 15న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 22న అవార్డుల కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను ప్రకటిస్తుంది. కొన్ని కేటగిరీల్లో ఓటింగ్‌ విధానంలో కూడా మార్పులు చేసినట్లు చెప్పింది.

నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని సభ్యులు తప్పకుండా చూడాల్సిందే. దీంతో పాటు అచీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌ అనే కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు అకాడమీ ప్రకటించింది. ఈ కేటగిరీలో విజేతను ఎంపిక చేసే ప్రక్రియ రెండు దశలుగా సాగనుంది. ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్‌ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి ఏఐతో తీసిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువగా సాధారణ చిత్రాలకే ప్రాధాన్యత ఉంటుందని అకాడమీ తెలిపింది.

ఇక 98వ ఆస్కార్ వేడుకలు లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన చిత్రాలు ఈ ఆస్కార్ కోసం పోటీపడనున్నాయి. మ్యూజిక్‌ కేటగిరీలో మాత్రం ఈ ఏడాది అక్టోబర్‌ 15గా నిర్ణయించారు. అదేవిధం 2027 నుంచి విడుదలయ్యే చిత్రాలకు ‘స్టంట్ డిజైన్’ అనే ప్రత్యేక విభాగంలో కూడా అవార్డులు అందించనున్నట్లు తెలిపింది. స్టంట్ కూర్పులో నైపుణ్యం చూపినవారికి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కొత్త కేటగిరీని ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Share This Post
error: Content is protected !!