August 7, 2025 12:04 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం.. వ్యక్తుల అరెస్ట్

భారత్ సమాచార్.నెట్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర దాడికి కారణమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఎన్ఐఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు ముష్కరులకు ఆశ్రయం కల్పించిన పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.

వారిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. అలాగే ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు. అలాగే వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై దర్యాప్తును కొనసాగిస్తు్నామని ఎన్ఐఏ వివరించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై పాశవిక దాడి చేశారు. ఈ ఘటనలో అమాయకులైన 26 ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌ ప్రతీకార దాడుల తాకిడికి పాకిస్థాన్‌ చివరకు కాళ్లు బేరానికి వచ్చి కాల్పుల విరమణకే అంగీకరించింది.
Share This Post