August 5, 2025 11:49 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ స్టార్స్ అకౌంట్స్ బ్లాక్

భారత్ సమాచార్.నెట్: పహల్గామ్‌ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య సంబంధాలు మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్.. ఇప్పటికే 16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛాన్సల్స్‌ (Yotube channels)ను నిషేధించింది. ఈ ఛాన్సల్స్ హానికరమైన సున్నితమైన విషయాలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. తాజాగా పాక్‌కు చెందిన ప్రముఖ నటులు (Stars)  మహిరా ఖాన్ (Mahirah Khan), హనియా ఆమీర్ (Hania Aamir), అలీ జాఫర్‌ల (Ali Zafar) సోషల్ మీడియా అకౌంట్స్‌ భారత్ దేశంలో బ్లాక్ చేసింది.

వారి ఇన్‌స్టా ఫ్రొఫైల్ ఓపెన్ చేయగా.. అకౌంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇకపోతే హానియా ఆమిర్, ‘మేరే హుమ్‌సఫర్’, ‘కభీ మై కభీ తుం’వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా ఇండియన్ టెలివిజన్‌పై అత్యంత ప్రాచుర్య పొందిన పాకిస్థాన్ నటి. పహల్గామ్ దాడిపై హానియా స్పందిస్తూ,”ప్రపంచంలో ఎక్కడా విషాదం జరిగినా.. అది మనందరికీ సంబంధం ఉంటుంది. పహల్గామ్ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మనం ఎక్కడివారైనా, ఏ ప్రాంతవారు అయినా.. అమాయకులు చనిపోతే ఆ బాధ మనందరిది. మానవత్వాన్ని ఎంచుకోవడం మన కర్తవ్యం అని పేర్కొన్నారు.
ఇకపోతే మహీరా ఖాన్ 2017లో షారుక్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం “రయీస్”లో నటించింది. కానీ, సెప్టెంబరు 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటులు బాలీవుడ్‌లో నటించడం మానేశారు. “రయీస్” చిత్రీకరణ ఉరీ ఘటనకు ముందే పూర్తయింది. ఇదిలా ఉంటే పహాల్గమ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పాక్-ఇండియా మధ్య ఉన్న ఇండస్ జల ఒప్పందం నిలిపివేత.. పాకిస్థాన్ పౌరులకు వీసాలు రద్దు చేయడం.. వంటి చర్యలు భారత్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Share This Post