భారత్ సమాచార్.నెట్: భారత్, పాక్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ అధికారి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir)లోని పుల్వామాలో (Pulwama) సైనికుల (Soldiers) కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడి 40 మంది ప్రాణాలు బలిగొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పాక్ (Pak) నోరు విప్పింది. పుల్వామా మెరుపుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశంలో .. పుల్వామా దాడి తమ పనేనని చెప్పకనే చెప్పాడు.
ఫిబ్రవరి 14 2019న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పాక్ సైన్యం పాత్ర ఉందన్న నిజాన్ని అంగీకరించాడు. పాకిస్థాన్‌కు చెందిన గగనతలం, జల సరిహద్దులు, భూభాగాలకు, ప్రజలకు ముప్పు పరిణమిస్తే ఎదుర్కొనే విషయంలో రాజీపడబోమని ప్రకటించారు. తాము దేశానికి రుణపడి ఉన్నామని.. పాక్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతామని అన్నారు. పాక్ సైనికాధికారి ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటనతో పాక్ ఉగ్ర ముసుగు తొలగిపోయింది. ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదని పాక్ చెబుతున్న మాటల్లో డొల్లతనం బయటపడింది.
పాక్ ఎంత బుకాయించినా వాయుసేన అధికారి వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు కూడా పాక్ వక్రబుద్ధి అర్థం కానుంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో కూడా పాక్ పాత్ర ఉందనే అనుమానాలు నిజం చేసేలా ఉన్నాయి. ఈ ప్రకటనతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని స్పష్టంగా వెల్లడవుతోంది. కాగా పుల్వామా దాడిలో తమ హస్తం లేదని గట్టిగా వాదించిన పాక్ ఇప్పుడు ఆ దాడిలో తమ ప్రమేయం ఉందని అంగీకరించడంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Share This Post