భారత్ సమాచార్, హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడని, ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా ప్రచారానికి వెళ్తానని గ్లామర్ క్వీన్ అనసూయ పేర్కొన్నారు. ప్రస్తుతం అనసూయ వెండితెరపై నటిగా దూసుకెళుతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ రీసెంట్‌గా వచ్చిన రజాకార్ వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా.. ఆయా పాత్రలు ఆమెను బిజీ నటిగా మార్చేశాయి. ఆమె ఎన్ని సినిమాలలో, ఎలాంటి పాత్రలు చేసినా అనసూయ అనగానే అంతా గ్లామర్ తారగానే చూస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు బీభత్సమైన ఆదరణను పొందుతుంటాయి. ఈ విషయంలో ఆమెకున్న క్రేజే వేరు. అలాంటి అనసూయ.. మైక్ పట్టి ప్రచారానికి దిగితే అదే చేస్తానంటోంది అనసూయ.
పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్:
ఓ ఇంటర్వ్యూలో ఈ ఎన్నికలలో ప్రచారం చేయమని వారు కోరితే ప్రచారం చేస్తారా? అనే ప్రశ్న అనసూయకు ఎదురైంది. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ఇప్పుడు నేను చెప్పే సమాధానం వివాదం కావచ్చు.. కానీ అడిగారు కాబట్టి చెబుతున్నా నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు కానీ నాకు పొలిటికల్ పార్టీస్ ముఖ్యం కాదు. నాకు లీడర్సే ముఖ్యం. మంచి లీడర్స్ ఏ పార్టీలో ఉన్నా సరే ప్రచారం చేయడానికి వెనుకాడను అని అనసూయ సమాధానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్, ఆయన ప్రచారం చేయమని పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని అనసూయ పేర్కొంది.
మరిన్ని వార్తలు…