భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా సరికొత్త, ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
చిత్ర యూనిట్ విడుదల చేసిన న్యూ పోస్టర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పవర్ ఫుల్ పోస్టర్ అభిమానుల్లో మరింత జోష్ నింపింది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘‘ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు థియేటర్ల వంతు.. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది.’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రటకన చేశారు.
ఇకపోతే దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు నమ్ముతున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, ‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.