August 11, 2025 2:55 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బ్లాక్‌బాక్స్ నుంచి డేటా రికవరీ

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి విమానం బ్లాక్‌బాక్స్‌ల నుండి సమాచారం సేకరించే దిశగా కీలక అడుగు పడింది. బ్లాక్‌బాక్స్‌లోని డేటాను ఏఏఐబీ ల్యాబ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విమాన ప్రమాదం జరిగిన తర్వాత జూన్ 13న ఏఏఐబీ బృందాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజున ప్రమాద స్థలమైన హాస్టల్ పైభాగంలో ఉన్న కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్‌లను గుర్తించారు. ఆ తర్వాత విమానంలోని బ్లాక్‌బాక్సును స్వాధీనం చేసుకున్నారు. జూన్ 24 నుంచి వీటిలోని డేటాను బయటకు తీసే ప్రక్రియను టీమ్ ప్రారంభించింది. తాజాగా విమానం ముందువైపు ఉండే బ్లాక్‌బాక్స్‌ నుంచి క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ సురక్షితంగా బయటకు తీసింది.

జూన్ 25న మెమొరీ మాడ్యుల్‌ యాక్సెస్‌ చేసి.. అందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్‌లో డౌన్‌లోడ్ చేశారు. ప్రస్తుతం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్‌ల్లోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనివల్ల విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ఆ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకనే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కూడా ఇది ఉపయోగపడనుందని విమానయాన శాఖ వివరించింది. కాగా ఈ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 270కి పైగా చేరింది.

Share This Post