July 29, 2025 5:00 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Ahmedabad Plane Crash: దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదాలివే

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి బయల్దేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రన్‌ వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం విమాన కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గుజరాత్ విమాన ప్రమాదం దేశంలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా చరిత్రలో నిల్చిపోనుంది. ఈ క్రమంలోనే దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల గురించి చర్చ మొదలైంది. భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలు ఇవే..
 -2010 మే 22 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను దాటి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 158 మంది మరణించారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
-2000 జూలై 17 పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
-1996 నవంబర్ 12 చర్ఖీ దాద్రీ విమాన ప్రమాదం భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం.  సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747,  కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 విమానం ఢిల్లీ సమీపంలో గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యూషిన్ ఇల్ విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.
– 1993 ఏప్రిల్ 26 ఔరంగాబాద్ విమాన ప్రమాదం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి, ఒక ట్రక్కు, విద్యుత్ తీగలను ఢీకొట్టాయి. ఈ విషాద ఘటనలో 55 మంది మృతి చెందారు.
 -1991 ఆగస్టు 16 ఇంఫాల్ విమాన ప్రమాదం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు.
-1990 ఫిబ్రవరి 14 బెంగళూరు విమాన ప్రమాదం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 605, ఎయిర్‌బస్ A320 బెంగళూరుకు చేరువలో కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు.
-1988 అక్టోబర్ 19 అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 113 అహ్మదాబాద్‌లో కూలిపోయింది. మొత్తం 133 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
-1985 ఆగస్టు 12.. ఈ తేదీన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జపాన్లోని పర్వతాల్లో కూలిపోయింది. దాదాపు 520 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
– 1982 జూన్ 21 బాంబే ఎయిర్ క్రాష్.. ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కుప్పకూలింది. దీంతో 17 మంది మరణించారు.
-1978 జనవరి 1బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది జలసమాధి అయ్యారు.
Share This Post