భారత్ సమాచార్.నెట్: ఉగ్రవాదాన్ని (Terrorism) ఎదుర్కొనే పోరాటంలో భారత త్రివిధ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ (Maan Ki baat) 122వ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందన్నారు. మన జవాన్లు చూపిన అపార ధైర్యం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రెట్టింపు చేసిందన్నారు. ఈ ఘటన అనేక కుటుంబాలను ప్రభావితం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమొత్తం ఏకమైందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జన్మించిన శిశువులకు పలువురు సింధూర్ అని నామకరణం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు.. అది మన ధైర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శమన్నారు. అదేవిధంగా మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. మావోయిస్టుల హింసాత్మక చర్యలు కూడా క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసం అభినందనీయమన్నారు. మావోయిస్టుల హింస గతంలోతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని తెలిపారు.
Share This Post