July 28, 2025 8:13 am

Email : bharathsamachar123@gmail.com

BS

PM Modi: విబేధాల అనంతరం తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: విబేధాల తర్వాత భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మాల్దీవుల పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. గతంలో మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై, లక్షద్వీప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ జరిగి కూడా ఏడాది అవుతుండగా.. విభేదాలు తర్వత ప్రధాని మోదీ తొలిసారిగా అక్కడి వెళ్తున్నారు.

అయితే యూకే పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 23, 24 తేదీల్లో ప్రధాని మోదీ బ్రిటన్‌లో పర్యటిస్తారు. యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య అంశాలలు సహా పలు కీలక చర్చలు జరపనున్నారు ప్రధాని మోదీ. అనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. గత మే నెలలో ఫ్రీ ట్రేడ్ ఎగ్రిమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎఫ్టీఏతో యూకే మార్కెట్లలో భారత్ ఉత్పత్తులు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వృద్ధి పెరుగుదలకు దోహదపడనుంది.
ఇక జులై 25 నుంచి 26 వరకు ప్రధాని మాల్దీవుల్లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే 60వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గతేడాది చోటుచేసుకున్న ఘటనలతో భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది జనవరిలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని మోదీ టూరిస్టులు ఇక్కడికి రావాలని పీలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. తాజాగా ప్రధాని మోదీని ఆహ్వానించింది. ప్రధాని పర్యటన ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరించేందుకు ఓ మైలురాయిగా మారే అవకాశం ఉంది.
Share This Post
error: Content is protected !!