భారత్ సమాచార్.నెట్, వారణాసి: ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన రుద్ర రూపాన్ని ప్రదర్శించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌పై దాడి చేసే వారిని పాతాళంలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదన్న సంకేతాన్ని భారత్ ఇచ్చిందన్నారు. ఆ మహాదేవ్ అశీర్వాదంతో పహల్గామ్ ఉగ్రదాడిలో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు ప్రధాని మోదీ. పహల్గామ్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను హత్య చేసిన సంఘటనతో నా హృదంయ దు:ఖంతో నిండిపోయిందన్నారు. నా కుమర్తెల సింధూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను.. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాను.
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మహాదేవ్ పాదాలకు అంకితం చేశానని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు. పాక్ ఉగ్రస్థావరాలు ధ్వంసమైతే కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు కనీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన జవాన్ల చూపిన ధైర్యాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరు కూడా వారికి సమస్యగా మారిందన్నారు.