August 3, 2025 11:43 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

PM Modi: ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు: ప్రధాని మోదీ 

భారత్ సమాచార్.నెట్: ఉగ్రవాదానికి (Terrorism) బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. జీ 7 సదస్సు (G7 Summit)లో భాగంగా ప్రధాని మోదీ కెనడా (Canada)లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీ 7 సదస్సులో ఆయన ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. మానవత్వంపై జరిగిన దాడి అని అన్నారు. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు.

ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్ విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరైన ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్నారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.
ఆహార లోపం, ఇంధన కొరత, ఎరువుల కష్టాలు, ఆర్థిక సంక్షోభం వంటి సవాళ్లను మొదటగా ఎదుర్కొంటున్నవారు వారేనని పేర్కొన్నారు. అలాంటి దేశాల ఆందోళనలు, అవసరాలను ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించడం భారత బాధ్యతగా భావిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు కెనడా పర్యటనలో భాగంగా ప్రధాన మోదీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా వంటి అనేక ప్రపంచ నేతలతో సమావేశమయ్యారు.
Share This Post