భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ టారిఫ్‌ల వ్యవహారంపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం విషయంలో తన ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో అమెరికాలో తయారయ్యే డెయిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి తెచ్చరని.. కానీ భారత్ దానిని తిరస్కరించిందన్నారు.
అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగిమతి చేసుకుంటే.. మన రైతులకు తీవ్ర నష్టం చేకూరుతందని అమెరికా స్పష్టంగా చెప్పటినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికాతో ఏర్పడిన విభేదాలు సాకుగా చూపిస్తూ.. ఈ విధంగా భారత్‌పై టారిఫ్‌ల రూపంలో ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం భారీ ధర చెల్లించాల్సి వస్తుందని.. అందుకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పెంపు నిర్ణయాన్ని దురదృష్టకర చర్యగా అభివర్ణించింది భారత్ విదేశాంగ. ఇతర దేశాలు కూడా తమ సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నాయని.. కానీ తమపైనే ట్రంప్ ఈ విధంగా చర్యలు చేపట్టడం సరికాదన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక రష్యా చమురు దిగుమతులపై మార్కెట్, జాతీయ ప్రయోజనాల అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని మరోసారి స్పష్టం చేసింది.
To Watch PM Modi Video Click The Link: https://twitter.com/i/status/1953315518204789179