August 9, 2025 7:45 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

PM Modi: చిన్నారులతో ప్రధాని మోదీ రక్షాబంధన్ వేడుకలు

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: హిందువుల జరుపుకునే పండుగలో రాఖీ పండగా తోబుట్టువులకు ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు భారతీయులు. నేడు రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. సోదరి సోదరుడు మధ్య ఉండే అపారమైన ప్రేమకు రక్షా బంధన్ ప్రతీక. ఈ పండుగ మీ బంధాలను మరింత మధురంగా మార్చాలని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ప్రధాని మోదీ.

 

అంతేకాదు ఇటు దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. రక్షా బంధన్ వేడుకలను కూడా ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో విద్యార్థులు, చిన్నారులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు ప్రధాని మోదీకి రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. రాఖీలు కట్టిన అనంతరం వారితో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇకపోతే ప్రతీ ఏడాది ప్రధాని మోదీకి స్కూల్ పిల్లలు, రాజకీయ నాయకులు, మహిళలు రాఖీ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక రక్షా బంధన్ వేడుకల అనంతరం ప్రధాని మోదీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులర్పించారు. రాఖీపండుగగతో పాటు నేడు క్విట్ ఇండియా ఉద్యమం 83వ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగానే ఆ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రధాని నివాళులర్పించారు.

 

To Watch video click the link below: 

https://x.com/i/status/1954110491720114362

Share This Post