భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్‌పై లోక్‌సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అమిత్ షా పంచుకున్నారని పేర్కొన్నారు.
ఉగ్రవాదులను ఏరివేయడంలో ఈ రెండు ఆపరేషన్‌లు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. తన ప్రసంగంలో, దేశ భద్రతను నిర్ధారించడానికి భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షా తన ప్రసంగంలో సవివరంగా చెప్పారంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు ప్రధాని.
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని.. దాయాది దేశం పాక్ తోక జాడిస్తే.. కలలో కూడా ఊహించని విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ సారి అంతకుమించిన ట్రీట్మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు మూడు దేశాలు మద్దతుగా నిలవగా.. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా గొంతు విప్పాయన్నారు. ఎన్డీఏ కూటామి తప్ప అందరూ సైన్యానికి, దేశానికి మద్దతుగా ఉన్నారని మండిపడ్డారు.