Homebreaking updates newsసునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ

సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: భారతీయ మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) లేఖ (Letter) రాశారు. దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు లేఖ రాశారు. మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలకు దగ్గరగానే ఉన్నారని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. భారత ప్రజలు మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ మిషన్‌లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నారని తెలిపారు. మీరు తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం అని మోదీ లేఖలో రాసుకొచ్చారు. ఇలా ప్రధాని మోదీ సునీతా విలయమ్స్‌ను అనేక విషయాలు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.

 

అయితే అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఈ లేఖను రాసినప్పటికీ.. ఆమె అంతరిక్షంలో ఉండడం వల్ల పంపించలేదు. కానీ తాజాగా ఈ లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌ను ఉద్దేశించి అనేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆమె భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత.. ఇండియాలో ఆమెను చూడాలని కోరుకుంటున్నట్లు మోదీ ఆ లేఖలో వెల్లడించారు. మార్చి 1న ప్రధాని మోదీ భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ఈ లేఖ రాశారు. అందులో భారత ప్రజలందరి తరఫు నుంచి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

 

అలాగే తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఓ కార్యక్రమంలో.. ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిసినట్లు చెప్పారు. ఆయనతో మాట్లాడుతుండగా.. మీ పేరు ప్రస్తావనకు వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అప్పడు తనతో పాటు భారత దేశ ప్రజలంతా మీ పని పట్ల ఎంత గర్వపడుతున్నామో చెప్పామని వెల్లడించారు. ఈ సంభాషణ తర్వాతే నేను మీకు ఉత్తరం రాయాలనుకున్నానని చెప్పుకొచ్చారు. తాను అమెరికా పర్యటన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బైడెన్‌ను కలిశానని.. వారితో మీ శ్రేయస్సు గురించి చర్చించానని మోదీ లేఖలో పేర్కొన్నారు.

 

కాగా దాదాపు 9 నెలల తర్వాత బుధవారం తెల్లవారుజామున వారు భూమి మీదకు చేరుకోనున్నారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూమి పైకి చేరుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌ లైనర్‌లో వారు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అయితే వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. ఇక అప్పటి నుండి వారు అక్కడే చిక్కుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments