Homebreaking updates newsPM Modi: కొత్త అవకాశాలను సృష్టించడమే నిజమైన పరిపాలన: ప్రధాని మోదీ

PM Modi: కొత్త అవకాశాలను సృష్టించడమే నిజమైన పరిపాలన: ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం (Decision) దేశ ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తుపై (Future) ప్రభావం చూపగలదని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యనించారు. ఈ సాంకేతిక యుగం (Technological age)లో పరిపాలన అంటే కేవలం వ్యవస్థలను నిర్వహించడం కాదని.. భవిష్యత్తు అవకాశాలను (Future Opportunities) కూడా ముందుగానే గ్రహించాలని పేర్కొన్నారు. 17వ సివిల్​ సర్వీసెస్​ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సమగ్ర అభివృద్ధి అనే పదానికి అసలు అర్థం.. దేశంలోని ఒక్క గ్రామం, ఒక్క కుటుంబం లేదా ఒక్క పౌరుడైనా వెనకబడకూడదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న ప్రతి నిర్ణయం ప్రజల దీర్ఘకాలిక భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఇది దేశంలోని యువత, రైతులు, మహిళలు, వారి ఆకాంక్షలు నేరవేర్చడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ తరహా అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే.. సాధారణ ప్రయత్నాలు సరిపోవని.. అదే సంకల్పంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అదే సమయంలో ఆయన టెక్నాలజీ ప్రాధాన్యతను కూడా ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ పరుగులు తీస్తున్న ఈ కాలంలో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడమే కాదని.. ప్రజల కోసం కొత్త అవకాశాలను సృష్టించడమే నిజమైన పరిపాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయన్నది ఎంతో కీలకమని.. దాని ఆధారంగా నాణ్యమైన పాలన కొనసాగించడం సాధ్యమవుతుందన్నారు. గత పదేళ్లలో భారతదేశం ఎన్నో కీలక మార్పులు జరిగాయని.. పాలనలో పారదర్శకత, ఆవిష్కరణ వంటి అంశాల్లో దేశం సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు.
2023లో భారతదేశం జీ20కు ఆతిథ్యమిచ్చిన సందర్భాన్ని కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు. అప్పుడు  ప్రజల భాగస్వామ్యం విధానం వల్ల ఈ కార్యక్రమం ఓ ప్రజా ఉద్యమంగా మార్చిందన్నారు. దీనివల్ల ప్రపంచమంతా భారతదేశంపై దృష్టి పెట్టింది. భారతదేశం అంతర్జాతీయ సదస్సుల్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. వాటిని సమర్థవంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అగ్రగామిగా మారుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీసు అధికారులకు ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడుతూ.. పేదల సమస్యలను మనస్ఫూర్తిగా వినాలని.. వారితో సంయమనం పాటిస్తూ, గౌరవంగా వ్యవహరించాలని.. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments