Homebreaking updates newsPrabhas: ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్

Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్

భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raajasaab). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మొదటిసారి ప్రభాస్ (Prabhas) హారర్ కామెడీ సినిమా (Horror Comedy Movie) చేస్తుండటం.. తాత గెటప్‌లో  కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రేపు సోమవారం అంటే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ఒక ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హర్రర్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హర్రర్ జానర్‌లో ప్రభాస్‌కి ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది.
తాజాగా విడుదల చేసిన టీజర్ డేట్ వీడియో కూడా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో మరింత హైప్ పెరిగింది. ఆ వీడియోలో ఓ పాడుబడిన ఇంటి ముందు హీరోయిన్ మాళవిక మరో ఇద్దరు హీరోయిన్లు భయపడుతూ పైకి చూస్తుండగా కనిపించారు. వీరితో పాటు మరికొందరు వ్యక్తులు కూడా ఆ దిశగా భయభ్రాంతులతో చూస్తున్నారు. అదే సమయంలో స్క్రీన్‌పై “ది రెబల్ వైబ్ టుమారో” అంటూ టీజర్ రిలీజ్ డేట్, టైమ్ చూపిస్తూ ఆసక్తిని పెంచారు. డిసెంబర్ 5న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments