Homebreaking updates newsబెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్

భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ల్ఫుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వాళ్లందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరికొంత మంది సినీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా కేసు నమోదైన వారిలో సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, రీతూ చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ఫాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. తాను మూడు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లు విష్ణు ప్రియ విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. మరోసారి విచారణకు హాజరైతే అప్పుడు పూర్తి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కొందరు తమ తప్పు తెలుసుకుని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ అప్పుడు ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరాను. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను. నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన యాడ్‌పై వివరణ ఇస్తా అని చెప్పారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments