August 2, 2025 6:31 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పశువులతో నిరసన

భారత్ సమాచార్.నెట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తమ ఇల్లును మున్సిపల్ అధికారులు కూల్చడంతో ఓ మహిళ పశువులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చిన ఘటన భూపాలపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. మంజూరునగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ రోడ్డు కోసం ఓదెలు అనే వ్యక్తి పశువుల కొట్టాన్ని(పశువుల పాక)ను మున్సిపల్ అధికారులు కూల్చారు. దీంతో స్కూల్ రోడ్డు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన పశువుల కొట్టాన్ని కూల్చేయించాడని ఆగ్రహించిన ఓదెలు, తన భార్య కలిసి తమ పశువులను ఎమ్మెల్యే గండ్ర క్యాంప్ కార్యాలయంలోకి పశువులను తీసుకొచ్చి నిరసన తెలిపారు.

బాధిత కుటుంబసభ్యులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు:
తన పశువుల కొట్టాన్ని మున్సిపల్ అధికారులు ఎలా కూలుస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉన్నవారిని ప్రశ్నించారు. పశువుల కొట్టాన్ని తమకు చెప్పకుండా ఎలా కూలుస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి పశువులు తీసుకొచ్చి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఓదెలను, తన భార్య, కుటుంబసభ్యులను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు పశువుల కొట్టాన్ని ఎలా తీసేస్తారని, బాధిత కుటుంబసభ్యులను పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Share This Post