Homebreaking updates newsపుష్ప-2, దేవర..ఓవర్సీస్ కింగ్ ఎవరు?

పుష్ప-2, దేవర..ఓవర్సీస్ కింగ్ ఎవరు?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ లో మంచి హైప్ ఉన్న చిత్రాల్లో పుష్ప-2, దేవర, గేమ్ ఛేంజర్, విశ్వంభర, కల్కి వంటి సినిమాలున్నాయి. అయితే కల్కి సినిమా బిజినెస్ ఇంకా మొదలు కాలేదు. కానీ మిగిలిన సినిమాల ఓవర్సీస్ బిజినెస్ ముందుగానే జరుగుతోంది. తెలుగుతో పాటు, ఇతర స్టేట్స్, ఓవర్సీస్ బిజినెస్ లు జరుగుతున్నాయి. అయితే ఓవర్సీస్ బిజినెస్ అందరినీ ఆకర్షిస్తోంది.

గత నెలలో వచ్చిన ప్రభాస్ ‘సలార్’ ఓవర్సీస్ లో దుమ్మురేపింది. 72 కోట్లకు అమ్ముడుపోయిన ఈ మూవీ 140 కోట్లు వసూలు చేసింది. ఇక అంతకుముందు బహుబలి-2 రూ.7ం కోట్లకు, త్రిపుల్ ఆర్ 68 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడా రికార్డులన్నీ అల్లు అర్జున్ బ్రేక్ చేసి ఓవర్సీస్ కింగ్ గా మారిపోయాడు. పుష్ప-2 ఓవర్సీస్ లో 90 కోట్లు పలుకుతోందని సమాచారం. అయిేత ఈ డీల్ పూర్తయిందా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదే నిజమైతే తెలుగు హీరోల్లో బన్నీదే రికార్డు.

ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ ఓవర్సీస్ లో తక్కువకే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. 27కోట్లకే అమ్ముడు పోయినట్టు సమాచారం. ఎందుకంటే ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మార్కెట్ తక్కువే. ఆయన సోలో సినిమా వచ్చి చాన్నాళ్లైంది. అందుకే ఆయన మార్కెట్ తక్కువే ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి..

ఇక తెలుగులో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో రూ.20 కోట్లకు అమ్ముడు పోయిందని చెబుతున్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’ కూడా జనాల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ వర్క్ వుట్ అయితే భారీ కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయం. ఈ మూవీ ఓవర్సీస్ లో 18 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. యువ హీరోలతో పోటీ పడుతూ మెగాస్టార్ ఓవర్సీస్ లో కూడా సత్తాచాటుతుండడం విశేషం.

మరికొన్ని సినీ సంగతులు...

బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

RELATED ARTICLES

Most Popular

Recent Comments