Homemain slides‘పుష్ప’ తగ్గనంటున్నాడు..ఇక ‘దేవర’ బ్యాక్ వెళ్లాల్సిందేనా?

‘పుష్ప’ తగ్గనంటున్నాడు..ఇక ‘దేవర’ బ్యాక్ వెళ్లాల్సిందేనా?

భారత్ సమాాచార్, సినీ టాక్స్ : ఎన్టీఆర్, బన్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ బావ..బావ అని పిలుచుకుంటారు. అయితే వీరిద్దరికి తమ సినిమాల రిలీజ్ డేట్ల సమస్య వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు తగ్గుతారో చూడాలి. అయితే ‘దేవర’ సినిమాను ప్రారంభించే టైంలోనే ఆ మూవీ యూనిట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఆ టార్గెట్ తోనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ మూవీ వాయిదా పడుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

పుష్ప-2 సినిమా వాయిదా పడితే ఆగస్ట్ 15న ‘దేవర’ను రిలీజ్ చేయాలని భావించారట. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మేరకు పుష్ప-2 వాయిదా పడడం లేదని సమాచారం. సుకుమార్ ఈ మూవీని అనుకున్న టైమ్ ఆగస్ట్ 15కే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా పుష్ప-2 టీం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఆగస్ట్ 15ను తాము లాక్ చేశామని ప్రకటించింది.

దీంతో దేవర మరింత బ్యాక్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లు అర్జున్ తగ్గితే ఇండిపెండెంట్ డేను టార్గెట్ చేద్దామనుకున్న ఎన్టీఆర్.. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ కు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే సెప్టెంబర్ లోనే రామ్ చరణ్, శంకర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఉంది. ఈ మూవీ దసరా టార్గెట్ గా తెరకెక్కుతోంది.

‘దేవర’ ఆలస్యానికి ప్రధానంగా రెండు కారణాలు కనపడుతున్నాయి. వీఎఫ్ఎక్స్ లేట్ అవుతోందట, అలాగే ఏప్రిల్ లో పార్లమెంట్ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. జనాలంతా ఎన్నికల మూడ్ లోనే ఉంటారు. అలాగే పరీక్షలు కూడా ఉంటాయి. దీంతో మూవీ టీం ఏప్రిల్ 5న క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో..ఏ సినిమాతో ఇబ్బంది లేకుండా డేట్ లాక్ చేసుకుంటారో వేచిచూడక తప్పదు.

మరికొన్ని సినీ సంగతులు…

ది కింగ్ ఆఫ్ మ్యూజిక్

RELATED ARTICLES

Most Popular

Recent Comments