August 2, 2025 9:24 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

గ్రానైట్ క్వారీ సూపర్ వైజర్ దుర్మరణం

భార‌త్ స‌మాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్రీ లక్ష్మీ గ్రానైట్స్‌లో ప‌ని చేస్తున్న క్వారీ సూపర్ వైజర్ దీకొండ రాజు (43) బండ మీద ప‌డ‌డంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలానికి చెందిన రాజు గత రెండేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జేసీబీతో గ్రానైట్ రాయిని జరిపి కిందపడేసే క్రమంలో, ఆ బండరాయి బురదలో పడింది. బురదలో ఉన్న రాయి బుల్లెట్ వేగంతో పైకి లేచి రాజు తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తన భర్త మృతిపై ఎవరిపైనా ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య దీకొండ సంతోష్ కుమారి ఫిర్యాదు మేరకు సైదాపూర్ ఎస్సై సిహెచ్. తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

మంచి మ‌న‌సు చాటుకున్న ఓదెల న‌రేశ్‌

 

Share This Post