July 28, 2025 8:11 am

Email : bharathsamachar123@gmail.com

BS

‘ప్రధాని ప్రసంగం.. మ్యాథ్స్ క్లాస్ విన్నట్లుంది’

న్యూఢిల్లీ, భారత్ సమాచార్.నెట్: రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ నేతలు చెప్పడం హాస్యస్పాదంగా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ‌ మాట్లాడారు. రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని తన రచనల్లో ఆర్‌ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్‌ స్పష్టంగా చెప్పారన్నారు. ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, ఆచరణలకు మనుస్మృతే ఆధారమని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్‌ ఆకాక్షించారని రాహుల్‌ వెల్లడించారు.

ప్రధాని ప్రసంగం.. మ్యాథ్స్ క్లాస్ విన్నట్లుంది:
‘మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి పార్లమెంట్‌లో మాట్లాడడం అంటే మీరు మీ నాయకుడు సావర్కర్‌ను అవహేళన చేస్తున్నట్టే’ అని రాహుల్‌ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రస్తుతం యుద్ధం జరుగుతోందని చెబుతూ.. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటనవేలిని గురుదక్షిణగా ఇచ్చిన అంశాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. అదానీకి ధారావి ప్రాజెక్టు అప్పగించినప్పుడే అక్కడి చిన్న, మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను మోదీ కోసేసినట్టయిందని చెప్పారు. ప్రధాని ప్రసంగం పాఠశాలలో వరుసగా రెండు గణితం క్లాసులు విన్నట్లుందన్నారు

Share This Post
error: Content is protected !!