భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ మూవీ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాజా సాబ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివర దశలో ఉంది. ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారిగా హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్ కామెడీ చిత్రం కావడంతో.. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజాసాబ్ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాజాసాబ్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజాసాబ్ చివరి దశ షూటింగ్స్ వేగంగా సాగుతోంది. మూవీ కథ ఆధారంగా, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టను బేస్ చేసుకుని.. మూవీ పార్ట్ 2 అవసరమని దర్శకుడు మారుతికి అనిపించడంతో.. పార్ట్ 2 స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారంటా. పార్ట్ 2 షూటింగ్ కావడమే ఆలస్యం. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.