భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్ (Pakistan) అప్పులు తెచ్చి మరీ ఉగ్రవాదులను మేపుతుందంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి (Union Minister of Defence) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. పాకిస్థాన్ ఎన్నో ఏండ్లుగా ఉగ్రవాదుల (Terrorists)ను పెంచిపోషిస్తుంటే.. భారత సైన్యం (Indian Army) కేవలం 23 నిమిషాల్లోనే వారిని మట్టుపెట్టిందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని భుజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దాయాది దేశమైన పాక్ చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోందని.. తేడా వస్తే ఆ దేశంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారత్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే వాటిని పునః నిర్మించుకోవడానికి పాకిస్థాన్ జైషే మహ్మద్ చీఫ్ మజూర్ అజార్‌కు రూ. 14 కోట్ల ఆర్థిక సాయం చేసిందన్నారు. ఐఎంఎఫ్ నిధులను పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం వెచ్చిస్తున్నదని ఆరోపించారు. పాకిస్థాన్‌కు అప్పులు ఇచ్చే విషయంపై ఐఎంఎఫ్ పునరాలోచించుకోవాలని సూచించారు.
ఇకపోతే ఆపరేషన్ సింధూర్‌లో భారత సైనికుల ప్రదర్శించిన అసామాన్య ధైర్యం.. దేశంలోనే కాదని.. విదేశాల్లోని భారతీయులను కూడా గర్వపడేలా చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పాక్‌కు అర్థరాత్రి, ఉదయం ఎలా ఉంటుందో చూపించిందన్నారు. భారత బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యాన్ని దాయాది దేశం కూడా ఒప్పుకుందన్నారు. 1965లో జరిగిన యుద్ధంలోనూ పాకిస్థాన్‌పై భారత విజయానికి భూజ్ వైమానిక స్థావరం సాక్షిగా నిలిచిందని గుర్తుచేశారు.
Share This Post