August 8, 2025 3:51 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం

భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్‌ (Pan India Star)గా ఎదిగిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్‌ (Ram Charan)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మైనపు విగ్రహాల (Wax Figures) ప్రదర్శనకు పేరొందిన లండన్‌ (London) మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో చెర్రీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 9న చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అరుదైన సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మెగా కుటుంబం మొత్తం ఇప్పటికే లండన్ చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, వారి కుమార్తె క్లీన్ కారా, పెంపుడు కుక్క రైమ్ కూడా లండన్‌లో దర్శనమిచ్చారు.

అయితే సాధారణంగా సినిమా రంగానికి అమితమైన కృషి చేసిన వారిని గౌరవిస్తూ మేడమ్ టూస్సాడ్స్ వారి మైనపు విగ్రహాలను తయారు చేస్తుంది. కానీ ఈసారి రామ్ చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్ కూడా ఇందులో భాగం కాబోతోంది. రామ్ చరణ్‌ విగ్రహాంతో పాటు  రైమ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కీరవాణి ఆర్కెస్ట్రాతోపాటు.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొనే ప్రశ్నోత్తర సెషన్‌ను కూడా నిర్వహించనున్నారు.
ఇక విగ్రహ ఆవిష్కరణ అనంతరం మే 11న లండన్‌ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రదర్శించినున్నట్లు కూడా తెలుస్తోంది. ఇకపోతే రామ్​ చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే ఉన్నాయి. కాగా గతేడాది జరిగిన ఐఫా వేదికగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టుస్సాడ్స్ తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించి ఫొటోషూట్ అప్పుడే పూర్తి కూడా చేశారు.
Share This Post