భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram charan) తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. లండన్ (London)లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం (Madame Tussauds Museum)లో ఆయన మైనపు విగ్రహాన్ని (Wax figure) ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన హాజరయ్యారు. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క ‘రైమ్’కి (Rhyme) కూడా టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం కల్పించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించడం అనేది ఏ సెలబ్రిటీకైనా అరుదైన గౌరవంగా భావిస్తారు. తాజాగా ఈ గౌరవం రామ్ చరణ్‌కు దక్కింది. లండన్‌లో ఏర్పాటు చేసిన తన మైనపు ప్రతిమను రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించారు. చరణ్ తన పెంపుడు కుక్కతో కలిసి వేదికపైకి వెళ్లి, సోఫాలో ఆసీనులైనట్లుగా ఉన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో చరణ్ మాస్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉంది.
Share This Post