భారత్ సమాచార్, దిల్లీ ;
మన కళ్లతో చూసేంత వరకు ఎవ్వరు చెప్పిన నమ్మకూడదు అని చెప్పేవారు మన పెద్దలు. కాలం వేగంగా మారింది,టెక్నాలజీ పుణ్యమా అని మన కళ్లతో చూసింది కూడా నిజమా, కాదా అని పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ లో కేటు గాళ్ల డీఫ్ పేక్ హవా నడుస్తోంది. దీని కారణంగా సెలబ్రిటీల ఇమేజ్ కూడా డామేజ్ అవుతోంది. కొంత కాలం ముందు నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ కారణంగా చాలా పెద్ద సమస్యను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తిగా బయటపడటానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇలా సాధారణ ప్రజలు సైబర్ నేరాలకు గురి కాకుండా భారత ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా దీనికి స్టార్ హీరోయిన్ రష్మిక ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక ఒక వీడియోను విడుదల చేసింది. ‘నా డీప్ ఫేక్ వీడియోని బాగా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. అదొక సైబర్ నేరం. అప్పుడు ఈ సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను… అందుకే నేను భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. ఆ ఐ4సీ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నాను. సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేం.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. అందరూ కలిసి కట్టుగా పోరాడి.. సైబర్ నేర రహిత భారత్‌ను క్రియేట్ చేద్దాం’’ అంటూ రష్మిక చెప్పు కొచ్చింది. తనకు జరిగింది ఇంకొకరి జరగకుండా సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి ముందుకు వచ్చిన రష్మికను చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు.