Homebreaking updates newsతెలంగాణలో జిల్లాలు 18కి తగ్గింపు ?

తెలంగాణలో జిల్లాలు 18కి తగ్గింపు ?

భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 33 జిల్లాలను అడ్డగోలుగా ఏర్పాటు చేశారని , జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో జిల్లాల తగ్గింపు విషయం చర్చనీయాంశమైంది.

అప్పటి సీఎం కేసీఆర్ ఇష్టారీతిన, తన లక్కీ నంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ములుగు, జగిత్యాల, జనగామ, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల వంటి జిల్లాలు చాలా చిన్నవి. కొన్ని చోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. మరో చోట ఒకే నియోజకవర్గం ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి.

అయితే రేవంత్ రెడ్డి 33 జిల్లాలను కేవలం 18 జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. రేవంత్ లక్కీ నంబర్ 9 అని అందుకే ఆయన జిల్లాల సంఖ్యను 18కి కుదించే ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 17 లోక్ సభ ఎంపీ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో మరో జిల్లాతో కలిపి మొత్తం 18 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

కాగా, ఇప్పటికే అన్ని జిల్లాల్లో దాదాపు కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీల వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం, జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న భూముల ధరలు పెరగడంతో.. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూ ఇదే విషయంలో ఘాటుగానే స్పందించారు. జిల్లాల తగ్గింపు చేస్తే మరోమారు ఆందోళనలు తప్పేలా లేవు. దీనిపై రేవంత్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

మరికొన్ని కథనాలు...

‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’

RELATED ARTICLES

Most Popular

Recent Comments