భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపుపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల ప్రవేశాలను సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీలలో సీటు సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి అన్ లైన్ వేదికగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం ట్రిపుల్ ఐటీలలో నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉండగా, ఏ సంవత్సరం ఏకంగా 53,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ అభ్యర్థుల జాబితాను www.rgukt.in అనే వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు. సీటు సాధించిన విద్యార్థులు కాల్ లెటర్ ని కూడా వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల ర్యాంకు ఆధారంగా వారికి కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్ కు హాజరు కావాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. కాగా ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులు ఆరు సంవత్సరాల పాటు ఇందులో ఉచిత విద్యాభ్యాసం, వసతి పొందవచ్చు. రెండవ రౌండ్ కి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ ని కూడా అధికారులు వెబ్ సైట్ లో పొందుపరచినట్లు తెలిపారు.