భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో నలుగురికి 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. జగన్మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది.
అంతకుముందు జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. హెచ్‌సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్‌తో కలిసి గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని జగన్మోహన్‌రావు ఫోర్జరీ చేసినట్టు సీఐడీ గుర్తించింది.
ఇకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు చేశారని, పదవి చేపట్టిన తర్వాత నిధులు మళ్లించారని జగన్మోహన్‌రావుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ను గురువారం అరెస్టు చేసింది సీఐడీ వైద్య పరీక్షల అనంతరం అతడని మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది. కాగా హెచ్‌సీఏ అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Share This Post