భారత్ సమాచార్.నెట్, మధ్యప్రదేశ్: దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు, చిన్నారులపై అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వావివరుసలు మరిచి కుటుంబసభ్యులనే హత్య చేస్తున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా తండ్రిని చంపిన తమ్ముడిపై పగ పెంచుకున్న ఓ అన్న ఎనిమిదేళ్ల తర్వాత అతన్ని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కలకలం రేపింది. శివపురి ప్రాంతానికి చెందిన హనుమాన్ సింగ్ తోమర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమాలురు ఉన్నారు. పెద్దకుమారుడు భాను, చిన్న కుమారుడు అజయ్ తోమర్. హనుమాన్ సింగ్ పోలీస్ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. 2017లో హనుమాన్ సింగ్ తోమర్‌ను కొందరు కాల్చి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ సమయంలో అతని చిన్న కుమారుడు అజయ్ తోమర్ మాత్రం తృటిలో తప్పించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్య కేసులో ఆయన చిన్నకుమారు అజయ్ తోమర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
హత్య చేయించి ఏమిఎరగనట్టు అంత్యక్రియల్లో పాల్గొని:
దర్యాప్తు చేసి నిందితుడిగా గుర్తించిన హనుమాన్ సింగ్ చిన్నకుమారుడు అజయ్ అజయ్ తోమర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అన్న భాను తోమర్ తమ్ముడి అజయ్‌పై పగ పెంచుకుని అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. గత నెలలో బెయిల్‌పై బయటకు వచ్చిన అజయ్ తోమర్‌పై భాను తోమర్ కిరాయి హంతకులతో హత్య చేయించాడు. దుండగులు తుపాకులతో అజయ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తనకు ఏమి తెలియనట్టు భాను విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియల్లో పాల్గొని తమ్ముడి మృతదేహాం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత భాను తోమర్ విదేశాలకు పారిపోయాడు. ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు హత్యకు వినియోగించిన కారు భాను తోమర్ పేరుతో ఉండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో కనిపించిన నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు ఈ హత్యలో ప్రధాన సూత్రదారుడు భానుతోమరే అని తెలిసి షాక్ అయ్యారు.