భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad)లో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) కారణంగా చాలా మంది మెట్రో (Metro)లో ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా గమ్యస్థానాల్ని చేరేందుకు మెట్రో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇటీవల మెట్రో ఛార్జీల (Metro Charges)ను పెంచుతూ మెట్రో రైలు యాజమాన్యం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రయాణికుల (Passengers) నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్ టీ సంస్థ వెనక్కి తగ్గింది.
పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ.. కొత్త ఛార్జీల చార్టును తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థ విడుదల చేసింది. ఇందులో 10 శాతం డిస్కౌంట్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త ఛార్జీల చార్టు ఇదే..
2 కిలోమీటర్లలోపు ఛార్జీ రూ.11
2 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.17
4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.28
6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.37
9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.47
12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.51
15 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.56
18 నుంచి 21 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.61
21 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.65
24 ఆపై కిలోమీటర్లకు ఛార్జీ రూ.69
ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ తగ్గింపు పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తిస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్ నిర్ణయంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. డిస్కౌంట్ ఎప్పుడైనా ఎత్తి వేసే అవకాశం ఉందని.. అందుకే మెట్రో ఛార్జీలపై డిస్కౌంట్ కాకుండా.. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
Share This Post