భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా అంటేనే అదృష్టం, అవశాశాల లెక్కలు. ఏ సినిమా ఆకాశానికి ఎత్తుతుందో.. ఏ చిన్న రోల్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుందో కాకలు తీరిన సినీ పండితులతో పాటు ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ప్రజెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ విషయంలోనూ జరిగింది. రూ.500 కోట్ల క్లబ్ నుంచి రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ‘యానిమల్’ లో చేసింది చిన్న పాత్రే గాని ఆమెకు వచ్చిన క్రేజ్ మాత్రం మాములుగా లేదు. నేషనల్ క్రష్ గా పేరున్న రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ మూవీలో నటించినా.. ఆమెను దాటేసిన త్రిప్తి.. నేషనల్ క్రష్ గా యూత్ ఆడియన్స్ ఆమెను ప్రొజెక్ట్ చేస్తున్నారు. యానిమల్ మూవీలో చాన్స్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసేసింది. ఇప్పటికే మేకర్స్ ఆమె ఇంటి తలుపులు తడుతున్నారట. తెలుగులోనూ ఆమె అందాల విందును పంచడానికి నిర్మాతలు ఇప్పటికే క్యూ కడుతున్నారట.
రణబీర్ తో త్రిప్తి చేసిన శృంగార సన్నివేశాలు మితిమీరిపోయాయని వచ్చిన విమర్శలపై రీసెంట్ గా త్రిప్తి మీడియా వేదికగా స్పందించింది. తాను కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ‘‘బుల్ బుల్’’ మూవీ రేప్ సీన్స్ తనను పర్సనల్ గా చాలా వేధించాయని, మైండ్ దారుణంగా డిస్ట్రబ్ అయ్యిందని, ఆ సన్నివేశాలనే ఎదుర్కొన్న నాకు రణబీర్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ అంతగా ఇబ్బందిగా అనిపించడం లేదని వెల్లడించింది. ఆ సన్నివేశం చత్రీకరణలో సెట్ లో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే ఉండేవారని, దీంతో పెద్దగా పర్సనల్ గా ఎఫెక్ట్ కాలేదని మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ‘బుల్ బుల్ ’లో సీన్ చేయాలంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం కన్నా ఆ సన్నివేశాలకు లొంగిపోవడం చాలా కష్టమని వివరించింది. వాటితో పోలిస్తే యానిమల్ మూవీ లో రొమాంటిక్ సీన్స్ చేయడానికి చాలా తక్కువ కష్టపడ్డానని తెలిపింది.