భారత్ సమాచార్.నెట్, ఏలూరు: నూజివీడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.30కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.. కాలువలు, చెరువుల పనులకు రూ.22కోట్లు, నూజివీడు పట్టణాభివృద్ధికి రూ.5కోట్లు, బలివే ఆలయ అభివృద్ధికి రూ.2.5కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు నవంబర్‌లో, రైట్ మెయిన్ కెనాల్ పనులు 2027 నాటికి పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. చింతలపూడి పథకానికి అడ్డుగా ఉన్న న్యాయ సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని చెప్పారు. అర్బన్, రూరల్ గృహ నిర్మాణాల బిల్లుల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని కథనాలు
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం