భారత్ సమాచార్, హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రతి పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసీ మరి కొద్ది మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించారు. తాజాగా పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ బరిలో నిలిపారు. మెదక్ పార్లమెంట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని అభ్యర్థి గా ప్రకటించారు.
ఇప్పటి వరకు 13 పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఇంకా పెండింగ్‌లో భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలు ఉన్నాయి.
నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
RELATED ARTICLES