Homebreaking updates newsత్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు

త్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు

భారత్ సమాచార్, జాతీయం ;

సాంకేతికత మానవ అవసరాలను ఎంత సులభతరం చేసిందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ వినియోగదారులు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాట్సాఫ్ అత్యంత ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వాట్సాఫ్ నుంచి యూపీఐ సేవలు ప్రారంభమై కూడా చాలా కాలమే అయింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సు టికెట్లను వాట్సాఫ్ నుంచి విక్రయించే దిశలో ఆలోచన చేస్తోంది వాట్సాఫ్ టెక్ టీం. ఇప్పటికే ఈ విషయం పై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ ఇటీవల వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఆర్టీసీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మరోవైపు యూపీఐ ద్వారా బస్సుల్లో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చూడాలి మునుముందు ఎలాంటి సేవలను వాట్సాఫ్ వినియోగదారులకు అందుబాటులో ఉంచనుందో.

మరికొన్ని వార్తా విశేషాలు…

బ్యాంకు లోన్ తో మీ ఇంటికి సోలార్ పవర్ తీసుకోవచ్చు

RELATED ARTICLES

Most Popular

Recent Comments