July 30, 2025 5:11 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

గ్రామాల్లో ఇంటర్నెట్ విప్లవం

భారత్ సమాచార్.నెట్, పెద్దపల్లి: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతోపాటు పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అటు సంగారెడ్డి, ఇటు పెద్దపెల్లి జిల్లాల్లో తొలుత ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ లో 1200 కుటుంబాలుండగా.. ఇప్పటికే 900 ఇళ్లకు టీ ఫైబర్ సేవలు అందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది 2024, డిసెంబర్ 8వ తేదీనే మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. గత ఏడాది నుంచే ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ టీ ఫైబర్ ద్వారా నిరంతరం శరవేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇందుకోసం మూడు డిజిటల్ బోర్డ్స్ తోపాటు, రెండు కంప్యూటర్ మానిటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడిక్కడ విద్య వీటి ద్వారానే డిజిటల్ మాధ్యమంలో కొనసాగుతోంది.

Share This Post