భారత్ సమాచార్.నెట్: భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రముఖ లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రపటాన్ని ప్రముఖ చిత్రకారుడు స్టువర్ట్ పియర్సన్ రైట్ ఆయిల్ పేయింటింగ్‌తో వేశారు.
సచిన్ టెండూల్కర్ చిత్రం కోసం ఆయన 18 ఏళ్ల క్రితం తీసిన ఓ ఫోటోను ఆధారంగా తీసుకుని వేశారు. అయితే ఈ ఏడాది చివరి వరకు సచిన్ చిత్రపటం ఈ మ్యూజియంలో ఉండనుంది. అనంతరం దీనిని పెవిలియన్ గ్యాలరీలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో కూడా పియర్సన్ భారత క్రికెట్ దిగ్గజులు బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ దిలీప్ వెంగ్‌సర్కర్ చిత్రపటాలను వేశారు. ఇప్పుడు వారితో పాటు సచిన్ పోట్రేట్ కూడా ఒకటిగా నిలవడం విశేషం.
ఇకపోతే ఈ చిత్రపటాన్ని ప్రదర్శించడంపై సచిన్ టెండూల్కర్ స్పందించారు. లార్డ్స్ మైదానంలో తన చిత్రంపటం ఏర్పాటు చేయడంపై సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. తన చిత్రపటం ప్రదర్శించడం ఎంతో గౌరవంగా ఉందని.. 1983లో భారత్ వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న సమయంలో తొలిసారిగా లార్డ్స్ స్టేడియాన్ని చూశానని.. ఆ క్షణాలు తన కళ్లముందు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు తన చిత్రపటం అక్కడ ఉండడం తన క్రికెట్ ప్రయాణాన్ని మళ్లీ గుర్తుకు తెస్తోందని తెలిపాడు.
Share This Post