Homebreaking updates newsSamantha: మా బంధానికి పేరు పెట్టలేను..!: సమంత

Samantha: మా బంధానికి పేరు పెట్టలేను..!: సమంత

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) ఇటీవ‌ల సినిమాల కన్నా కూడా ఇత‌ర విష‌యాలతో ఎక్కువ‌గా వార్తలలో నిలుస్తున్నారు. మ‌యోసైటిస్ వ‌ల‌న సినిమాలు కాస్త త‌గ్గించిన స‌మంత సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న ప‌ర్సన‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు పంచుకుంటున్నారు. అలానే పలు ఇంటర్వ్యూల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో జరిగిన గోల్డెన్‌ క్వీన్‌ అవార్డుల (Golden Queen Award) కార్యక్రమంలో ప్రముఖ నటి సమంత గోల్డెన్‌ క్వీన్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సామ్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌తో తన అనుబంధంపై కూడా సామ్ వ్యాఖ్యలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో.. రాహుల్‌ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని.. తమ బంధానికి పేరు పెట్టలేనని ఎమోషనల్ అయ్యారు సామ్. అతను నా మిత్రుడా? సోదరుడా? కుటుంబసభ్యుడా? లేక రక్త సంబంధిత వాడా? అన్నదే స్పష్టంగా చెప్పలేనన్నారు.  ఇక రాహుల్‌పై సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అలాగే అభిమానుల గురించి కూడా సామ్ మాట్లాడుతూ.. ఇంతమంది అభిమానులను సంపాదించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ స్థాయికి రావడంలో తన అదృష్టంతో పాటు.. తాను పెట్టిన శ్రమ కూడా ప్రధాన కారణమని… ఈ ప్రేమను దేవునిచ్చిన వరంగా చూస్తాన్నన్నారు. మనం తీసుకునే ఒక్క నిర్ణయం ఆధారంగా కెరీర్‌ను నిర్ణయించలేమన్నారు. ఎన్నో నిర్ణయాలు.. అవి తెలిసి తీసుకున్నవైనా, తెలియక తీసుకున్నవైనా.. మన కెరీర్‌పై ప్రభావం చూపుతాయన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే.. సమంత ప్రస్తుతం “రక్త బ్రహ్మాండ్” కోసం వర్క్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఇది సిద్ధం అవుతోంది. అలాగే ఆమె నిర్మాతగా వ్యవహరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘శుభం’ మే 9న రిలీజ్ కానుంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments