భారత్ సమాచార్.నెట్: స్టార్ హీరోయిన్ (Star Actress) సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన సమంత.. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ (Ye Maaya Chesave) సినిమాతో టాలీవుడ్‌లో (Tollywood) ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించి ఈ ముద్దుగుమ్మ అందరి మనసులు దోచుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో నటించిన ఈ భామ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
అయితే ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. ప్రేమగా మారిన వారి పరిచయం 2017 అక్టోబర్ 6న గోవాలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వారు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2021 అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోయారు. నాగచైతన్య ట్విట్టర్ ద్వారా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్యతో విడిపోయాక సామ్ ఓంటరిగానే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ వార్తపై ఓ రూమర్ వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని.. తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో సామ్ పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది. ఇటీవల తిరుమల శ్రీవారిని వీరు ఇరువురు దర్శించుకోవడంతో.. ఈ పెళ్లి గాసిప్‌కు మరింత ఊపొచ్చింది. ఇప్పటికే వీరు డేటింగ్‌లో ఉన్నారని.. మే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్’ చిత్రం మే 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.