భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలయ్య బాబు అభిమానులకు బ్రేకింగ్ న్యూస్… నందమూరి నట సింహం కెరీర్ లో ఆల్ టైం సూపర్ హిట్ క్లాసిక్ మూవీ ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ విడుదల తేదీని దర్శకనిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. మార్చి 2వ తేదీన 4కె క్వాలీటీ ప్రింట్ తో మళ్లీ సమరసింహం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 1999 జనవరి 13న విడుదలై అప్పటి వరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులన్నిటి బద్దలుకొట్టి కొత్త ట్రెండ్ ను తెలుగు చిత్ర పరిశ్రమలో సెట్ చేసింది. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించగా, యువరత్న నందమూరి బాలయ్య బాబు పక్కన సిమ్రాన్, అంజలా జవేరీ నాయికలుగా నటించారు. ప్రముఖ రచయిత బి.విజయేంద్రప్రసాద్ ఈ ఆల్ టైం సూపర్ హిట్ సినిమా కథను రచించారు. మణిశర్మ స్వరాలు చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఇందులోని అన్ని పాటలు కూడా క్లాసిక్ గీతాలుగా అలరించాయి. వింటేజ్ లుక్ లో ఉండే యువరత్న నందమూరి బాలక౹ష్ట ను చూడటానికి సినీ ప్రేమికులు మళ్లీ రెడీ అయిపోతున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులోని బాలయ్య బాబు డైలాగులు, మేనరిజం, ప్లాష్ బ్యాక్ , ప్రతి నాయకుడిగా ప్రకాశ్ రెడ్డి నటన ఈ మూవీ బాక్సఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటానికి కారణం అయ్యాయి. మరోవైపు ఇదే నెలలోనే తారక్ కెరీర్ ని మలుపు తిప్పిన ‘సింహాద్రి’ మూవీ రీరిలీజ్ అవుతోంది. దీంతో నందమూరి అభిమానులు డబుల్ ఖుషి అవుతున్నారు. ఈ రెండు సనిమాలకు కూడా ప్రముఖ కథా రచయిత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్ కథను రచించడం మరో విశేషం. మరి రీరిలీజ్ బాక్సాఫీస్ బరిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
