భారత్ సమాచార్.నెట్: సొట్టబుగ్గల సుందరి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లైన తర్వాత లావణ్య చేసిన తొలి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా సతీ లీలావతి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రెగ్నేన్సీతో ఉన్న లావణ్య.. ప్రెగ్నేన్సీకి ముందే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
భార్య భర్తల మధ్య జరిగే ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో లావణ్య, దేవ్ మోహన్ భార్యభర్తలుగా నటిస్తుండగా.. వీటీవీ గణేశ్, సప్తగిరి తదితరులు నటించారు. లావణ్య, దేవ్ మధ్య జరిగే సంభాషణల్లో వచ్చే పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ యూత్‌ను ఈ డైలాగ్స్ ఆకర్షిస్తున్నాయి. టీజర్ మధ్యలో వీటీవీ గణేష్, సప్తగరి సన్నివేశాలు అలరిస్తున్నాయి.
ఇకపోతే ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తుండగా.. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరపుకుంటున్నాయి. త్వరలో ట్రైలర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
To Watch Teaser Click The Link Below:
https://youtu.be/pwcni4WHUSc?si=4_NfVDxXQumUwi4O