August 5, 2025 12:54 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

సాహసం చేసి భార్యను రక్షించాడు.. కానీ..అంతలోనే ఊహించని పరిణామం

భారత్ సమాచార్.నెట్, మధ్యప్రదేశ్: చెరువులో మునిగిపోతున్న తన భార్య కోసం భర్త చెరువులో దూకిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో చోటు చేసుకుంది. అతను ఆమెను మృత్యువు బారి నుంచి కాపాడాడు. కానీ అతను తన ప్రాణాలను మాత్రం దక్కించుకోలేకపోయాడు.

భార్యను రక్షించి భర్త తనువు చాలించాడు:
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని ఉంచెహ్రా పరిధిలోని పరస్మానియా నివాసి రాజ్ బహదూర్ సింగ్ గోండ్ తన కుటుంబంతో కలిసి ఇంటి సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లాడు. ఈ కుటుంబం ఇటీవల తమ పిల్లలలో ఒకరిని కోల్పోయి సాంప్రదాయ ఆచారాన్ని నెరవేర్చడానికి చెరువులో స్నానం చేస్తోంది. కానీ బహుశా విధి ఆడిన వింత నాటకంలో తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. రాజ్ బహదూర్ భార్య అంజు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా చెరువులో జారిపడింది. గమనించిన రాజ్ బహదూర్ వెంటనే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చెరువులోకి దూకాడు. తన శక్తి, ధైర్యంతో తన భార్యను సురక్షితంగా బయటకు తీశాడు. కానీ ఈ సమయంలో అతనే లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోయాడు. గ్రామస్తులు వెంటనే చెరువులో దూకి అతన్ని బయటకు తీయగా అతడు చనిపోయాడు.

గతంలో బిడ్డ, ఇప్పుడు భర్త:
రాజ్ బహదూర్ మరణ వార్త గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరస్మానియా అవుట్‌పోస్ట్ పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. భర్త మరణంతో భార్య అంజు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇప్పటికే ఒక బిడ్డను కోల్పోయి బాధలో ఉండగా తాజాగా జీవిత భాగస్వామి కూడా ఇలాగే మరణించడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

మరిన్ని కథనాలు:

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని..

Share This Post