భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముందు రోజుల్లో ప్రభుత్వ పథకాల నగదును లబ్దిదారుల అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం రాష్ట్ర హై కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ ఎలక్షన్ కమిషన్ నగదు బదిలీకి ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోకపోవటంతో డీబీటీ నిధుల జమకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లలోకి నేడు విడుదల చేసింది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల (YSR చేయూత, EBC నేస్తం) నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.