Homemain slidesవిద్యార్థుల కోసం ఫిర్యాదుల పెట్టె...

విద్యార్థుల కోసం ఫిర్యాదుల పెట్టె…

భారత్ సమాచార్, జాతీయం ;

పాఠశాల విద్యార్థుల రక్షణ, హక్కుల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలను చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల పాఠశాలలలో సలహా కమిటీలు, ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రక్షణ కోసం సలహా కమిటీని, విద్యార్థుల సమస్యలను అనామకంగా పరిష్కరించటానికి, చర్చించటానికి ప్రత్యేక ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలో ఉండే సలహా కమిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికి విద్యా శాఖ అధికారులు ఉంటారు. ఈ కమిటీ విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు, బెదిరింపులు, లైంగిక వేధింపులు, అసురక్షిత పాఠశాల కార్యకలాపాలు వంటి సమస్యలు చర్చించటానికి, పరిష్కరించటానికి ప్రతి నెలా సమావేశం అవుతుంది.

ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ మరియు మెట్రిక్యులేషన్ పాఠశాలలకు జారీ చేసిన మార్గదర్శకాలలో పాఠశాలలు తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల వెనుక కవర్లపై టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 14417, 1098లను ప్రదర్శించాలని పేర్కొంది. దీని వలన విద్యార్థులు వేధింపులు లేదా ఇతర అసురక్షిత కార్యకలాపాలకు సంబంధించిన సంఘటనలను అనామకంగా నివేదించవచ్చని తెలిపింది. క్యాంపస్ కార్యకలాపాల కోసం, పాఠశాలలు తప్పనిసరిగా తల్లిదండ్రులు జిల్లా విద్యా అధికారి (DEO) నుంచి ముందస్తు వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. లింగ నిర్ధిష్ట పర్యవేక్షణతో ప్రతి పది మంది విద్యార్థులకు ఒక టీచర్‌ని నియమిస్తామని పేర్కొంది. ఈ భద్రతా చర్యల అమలును పర్యవేక్షించడానికి, పాఠశాలలు పాటిస్తున్నాయని నిర్ధారించడానికి తనిఖీలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పర్యవేక్షణ అధికారులను నియమించిందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. విద్యార్థుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇటువంటి చర్యలను ఇతర రాష్ట్రాలు కూడా చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేకం

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments