భారత్ సమాచార్.నెట్: టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161)తో శుభమన్ గిల్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే గిల్ ర్యాంకు ఏకంగా 15 స్థానాల నుంచి 6వ స్థానానికి చేరింది. ప్రస్తుతం శుభమన్ గిల్ 807 రేటింగ్స్‌తో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇకపోతే ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించాడు. హ్యారీ బ్రూక్ 886 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. జో రూట్‌ను (868) వెనక్కునెట్టి హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల భారత్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ (158) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు తొలి టెస్టులో కూడా రాణించిన బ్రూక్.. వరల్డ్ నెం 1 టెస్టు బ్యాటర్‌గా సత్తాచాటాడు.
ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో శుభమన్ గిల్‌తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. యశస్వి జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఇక భారత్‌తో రెండో టెస్టులో సత్తాచాటిన ఇంగ్లాండ్ కీపర్ జెమీ స్మిత్ 10 స్థానం సంపాదించాడు. మరోవైపు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు.